రాజకీయ నేతలపై పంచ్‌ పేల్చిన యాంకర్‌ సుమ

sumaతెలుగు అమ్మాయి కాకున్నా కూడా తొగు చక్కగా మాట్లాడుతూ తన వ్యాఖ్యలతో అందరిని ఆకర్షించే సుమ ముందు ఎంతో మంది యాంకర్‌లు వచ్చినా కూడా నిలవలేకపోతున్నారు. తెలుగులో టాప్‌ యాంకర్‌గా గతకొంత కాలంగా వెలుగుతున్న సుమ కార్యక్రమాల ఎపిసోడ్‌లు వేలో ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక కార్యక్రమానికి రఘు మాస్టర్‌ తన సతీమణి ప్రణవితో కలిసొచ్చాడు. కాగా ఈ ఇద్దరి ప్రేమను అడిగి తెలుసుకున్న సుమ పెళ్లికు ముందు, పెళ్లి తర్వాత అంశాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.

గాయని ప్రణవి తన భర్త రఘు అంటే తనకు చాలా ఇష్టమని, రఘు తన కోసం నాలుగేళ్లు ఎదురు చూశాడు అని, ఈ కాలంలో ఎవరు ఇలా ఆగుతారు అంటూ ప్రేమ కురిపించింది. సినిమా రంగంలో ఇలా ప్రేమించిన ఒక వ్యక్తి కోసం నాలుగేళ్లు ఎదురు చూడడం చాలా అరుదు కదా అందుకే రఘు అంటే నాకు ప్రాణం అన్నది. దాంతో వెంటనే సుమ అధికారం కోసం రాజకీయ నేతలు ఎన్ని సంవత్సరాలు అయినా ఎదురుచూస్తారు, ఇలా ఒక అమ్మాయి కోసం ఎవరు ఎదురుచూస్తారు అంటూ రాజకీయ నేతలపై పంచ్‌ పేల్చింది.