‘స్పైడర్’ లో రకుల్ రోల్ ఏంటో తెలుసా..?

rakul-role-spyderచిన్న చిత్రాలతో కెరియర్ మొదలు పెట్టి..ప్రస్తుతం అగ్ర హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరుకున్న రకుల్ ప్రీతి సింగ్..ప్రస్తుతం మహేష్ నటిస్తున్న స్పైడర్ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. నిన్ననే ఈ మూవీ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష స్పందన రాబట్టింది.

ఇక ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుంది. మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పైడర్ సినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సమాంతరంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా మహేష్ ఇంటర్వ్యూ రేపు పత్రికలో రానుంది. ఆ ఇంటర్వ్యూలోనే రకుల్ క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని మహేష్ బయటపెట్టాడు. అంతేకాదు, సినిమాకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ కూడా రేపు వికటన్ పత్రికలో రాబోతున్నాయి.

mahesh

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏప్రిల్ 15 నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. ఎస్ జె సూర్య విలన్ రోల్ చేస్తుండగా , హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.