లండన్‌ చెక్కేసిన ‘ఉయ్యాలవాడ’ ఎందుకంటే..??

uyyalavada narasimha reddyమెగాస్టార్‌ చిరంజీవి తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’తో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని మూటగట్టుకున్నాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన ఈ చిత్రం చిరుకు మంచి బూస్ట్‌ అయ్యింది. చిరు తదుపరి చిత్రం కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. స్వాతంత్రం తొలినాళ్లలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన సమరయోధుడు ‘ఉయాల్యవాడ నరసింహారెడ్డి’ కథతో చిరు తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఉయ్యాలవాడ సమాచారాన్ని ఇప్పటికే రాయలసీమలో ఉన్న ఆధారాల ద్వారా సేకరించారు. కాకపోతే చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి విడుదలయ్యాక ఎలాంటి విమర్శలు రావొద్దు అని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాయలసీమలో సేకరించిన సమాచారాన్ని అలా భద్రపరిచి ప్రస్తుతం లండన్‌లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. లండన్‌లోని నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో ఉయ్యాలవాడకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆధారాల ద్వారానే కథను సిద్దం చేయాలని చిత్ర యూనిట్‌ పక్కాగా సమాచారాన్ని సేకరిస్తోంది. లండన్‌లో సమాచారం తీసుకున్నాక వచ్చి పూర్తి కథను సిద్దం చేసి వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు ఎలా ఉండబోతున్నాడు అనే లుక్‌ కూడా ఇప్పటికే బయటకు వచ్చేసింది.