‘మిర్చి’ చిత్రం వరకు తన క్రేజ్ ఒకలా ఉంటే ఆ తర్వాత నటించిన ‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’కి ముందు ప్రభాస్ డార్లింగ్‌గా ఉండేవాడు కానీ ‘బాహుబలి’ చిత్రం తర్వాతి నుండి బాహుబలుడిగా బాలీవుడ్, హాలీవుడ్‌లలో సైతం అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఈయన త్వరలో సుజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. కాగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ పెళ్లిపై ఇప్పటికే చాలారకాల పుకార్లు నెట్లో హల్చల్ చేశాయి. ఇక తాజాగా ఒక హీరోయిన్ ప్రభాస్‌కు రహస్య మెసేజ్‌ను పంపిందట!!
ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభాస్‌ను కలవాలని ప్రయత్నించినా కూడా కుదరకపోవడంతో టాలీవుడ్‌లోని ఒక హీరో దగ్గరినుండి ప్రభాస్ ఫోన్ నెంబర్‌ను తెలుసుకుని ప్రభాస్‌కు మెసేజ్ చేసిందట బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ. అడపాదడపా చిత్రాల్లో నటించే కైరాకు ప్రభాస్‌తో ఏం పని, ఎందుకు మెసేజ్ చేసింది అనేది బయటకు పొక్కలేదు కానీ మొత్తానికి కైరా మెసేజ్‌కు ప్రభాస్ కూడా రిప్లై ఇచ్చాడని సమాచారం అందుతోంది.
కైరా అవకాశం కోసం ప్రభాస్‌కు మెసేజ్ చేసింది తప్పా మరేం లేదు అని ప్రభాస్ సన్నిహితులు అంటున్నారు. కానీ ఇంతకు ముందు చాలాసార్లు కలవడానికి ప్రయత్నించిన కైరా ప్రభాస్‌కు పంపిన రహస్య మెసేజ్ ఏంటి అనేది చాలా ఆసక్తిగా మారింది.