మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, దర్శకుడు శ్రీనువైట్ల కాంభోలో తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. శ్రీనువైట్ల తన తాజా చిత్రం ‘మిస్టర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడుతూ ‘బ్రూస్‌లీ’ ఫ్లాపుకు కారణాన్ని తెలిపాడు.
మాటల మధ్యలో ‘బ్రూస్‌లీ’ టాఫిక్ రాగా ఆ చిత్ర సమయంలో పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడం వల్ల తాను అనుకున్న విధంగా తెరకెక్కించలేదట. మొదటగా ప్లాన్ చేసుకున్నట్టు షూటింగ్ జరపక పోవడంతో సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు. అనుకున్న విధంగా షూట్ చేస్తే మంచి హిట్ అయ్యేది అని చెప్పుకొచ్చాడు.
ఇదంతా చెప్పాడు కానీ తాను అనుకున్నట్టు ఎందుకు తెరకెక్కించలేదు, తనకు అనుకూలించని పరిస్థితులు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. కానీ తనకు మాత్రం ఆ చిత్రం ఎందుకు ఫ్లాప్ అయ్యిందో ఒక క్లారిటీ ఉందని అంటున్నాడు. ‘మిస్టర్’ చిత్రం గురించి మాట్లాడుతూ ఈ చిత్రం తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అని ధీమా వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా లావణ్య త్రిపాఠి మరియు హెబ్బాపటేల్‌లు నటించారు. ‘మిస్టర్’ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది.