శ్రీనువైట్ల ఫ్యూచర్‌ ప్లాన్స్‌

srinu vaitlaటాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌లో ఒక్కడైన శ్రీనువైట్ల తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్‌’. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై చాలా నమ్మకంతో శ్రీనువైట్ల ఉన్నాడు. ఈయన గత చిత్రాలు ‘బాద్‌ షా’, ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. అయినా కూడా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం ఫలితం శ్రీనువైట్ల కెరీర్‌ను నిర్ణయిస్తుందని టాక్‌ ఉంది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా తన ఫ్యూచర్‌ ఫ్లాన్స్‌తో శ్రీనువైట్ల రెడీగా ఉన్నాడు.

ఇప్పటి వరకు శ్రీనువైట్ల వేరే బ్యానర్స్‌లలో చేస్తూ వచ్చాడు. అయితే త్వరలోనే తన సొంత బ్యానర్‌ను ప్రారంభించబోతున్నట్లుగా శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు. ఆ బ్యానర్‌లో తన సినిమాలు మాత్రమే కాకుండా కొత్త వారిని కూడా ప్రోత్సహిస్తాను అంటూ పేర్కొన్నాడు. ఇప్పటికే సుకుమార్‌ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెల్సిందే. ఇంకా పలువురు దర్శకులు మరియు హీరోలు కూడా సొంత ప్రొడక్షన్‌ హౌస్‌లను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనువైట్ల కూడా కొత్త బ్యానర్‌తో రాబోతున్నాడు. మరి నిర్మాతగా శ్రీనువైట్ల సక్సెస్‌ అవుతాడా అనేది చూడాలి.