మోత్కుపల్లి కల నెరవేరబోతుందా?

mothuతెలుగు దేశం సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గత కొంత కాలంగా గవర్నర్‌ పదవి కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్నాడు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావడమే ఆలస్యం తనకు గవర్నర్‌ పదవి వచ్చిందని మోత్కుపల్లి సంబుర పడ్డాడు. అయితే కేంద్రం వద్ద చంద్రబాబు నాయుడు పాచికలు పారలేదు. దాంతో మోత్కుపల్లికి ఎదురు చూపులు తప్పలేదు. ఒకానొక దశలో పార్టీ మారుతాను అంటూ మోత్కుపల్లి అనడంతో గవర్నర్‌ పదవి ఇప్పిస్తాను అంటూ మళ్లీ హామీని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చుకోబోతున్నట్లుగా అనిపిస్తుంది. బీజేపీతో పట్టుబట్టి మరీ చంద్రబాబు నాయుడు మోత్కుపల్లికి గవర్నర్‌ పదవి ఇప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను మోత్కుపల్లి కలవడం జరిగింది. వీరిద్దరి మద్య గవర్నర్‌ పదవి విషయమై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే కొన్ని రాష్ట్రాల గవర్నర్‌లను నియమించే అవకాశం ఉంది. ఆ నియామకంలో మోత్కుపల్లికి కూడా ఛాన్స్‌ దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మోత్కుపల్లి వారి కల నెరవేరబోతుందన్నమాట.