కోమటిరెడ్డి బ్రదర్స్‌ సంచలన నిర్ణయం

komati reddy brothersతెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆ మద్య టీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే వారి రాజకీయ ప్రత్యర్థి అయిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో వారు అధికార పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. గుత్తా ఒక వేళ టీఆర్‌ఎస్‌లో జాయిన్‌ అవ్వకుండా ఉండి ఉంటే ఇప్పటి వరకు వీరిద్దరు టీఆర్‌ఎస్‌లో ఉండే వారు అనేది ప్రతి ఒక్కరి మాట. టీఆర్‌ఎస్‌ను వద్దనుకున్న ఈ బ్రదర్స్‌ కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు బీజేపీతో దోస్తీకి ప్రయత్నాలు చేస్తున్నారు.

న్లగొండ జిల్లాలో మంచి పట్టు ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీలో చేరితే మంచే జరుగుతుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. దాంతో రాష్ట్ర అధ్యక్షులు మరియు జాతీయ స్థాయి నాయకులు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం కార్యకర్తలు మరియు ఇతర జిల్లాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులతో కోమటిరెడ్డి చర్చించి, తుది నిర్ణయాన్ని మరి కొన్ని రోజుల్లోనే వెళ్లడి చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తెలంగాణలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంది. వీరిద్దరు కూడా ఆ పార్టీని వీడితో మరిన్ని కష్టాలు కాంగ్రెస్‌కు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో నెం.2 స్థానం కోసం ప్రయత్నాలు చేస్తుంది.