తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి గత కొంత కాలంగా ఏవో ప్రచారం, పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఆ మద్య నెల రోజుల పాటు కేసీఆర్ అమెరికా చికిత్స కోసం వెళ్లబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాa నుండి లేదా కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కేసీఆర్ ఎప్పుడు కనిపించినా కూడా హుషారుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఆయన అనారోగ్యం గురించి మాత్రం పుకార్లు ఆగడం లేదు.
తాజాగా మరోసారి కేసీఆర్ అనారోగ్య విషయమై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా శ్రీరామ నవమి సందర్బంగా ప్రభుత్వం తరపున భద్రాద్రి రామయ్యకు సీఎం కేసీఆర్ పట్టువస్త్రాలు మరియు తలంబ్రాలు సమర్పించాల్సి ఉంది. కాని కేసీఆర్ అనారోగ్య కారణంగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కేసీఆర్ హాజరు కాకపోవడంతో ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలు మరియు తలంబ్రాలు సమర్పించారు. ఇంతకు కేసీఆర్కు ఏమైంది అనే విషయం మాత్రం వెళ్లడి కాలేదు.