ఇండియన్ టెలికాం రంగంలో ఎన్నో మార్పులకు కారణం అయిన జియో త్వరలోనే డీటీహెచ్ రంగంలోకి అడుగులు వేయబోతున్నట్లుగా తేలిపోయింది. డీటీహెచ్‌లో కూడా జియో తన ప్రతాపం చూపించేందుకు సిద్దం అవుతుంది. ఏ రంగంలో రిలయన్స్ కాలు మోపినా అక్కడ సంచలనాలు ఖాయం. అలాగే డీటీహెచ్ రంగంలో కూడా సునామిలా జియో ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం జియో డీటీహెచ్ టెస్టింగ్ నడుస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిలయన్స్ ఆఫీస్‌లలో జియో డీటీహెచ్ సేవలను ప్రారంభిస్తున్నారు. టెస్టింగ్ పూర్తి చేసిన తర్వాత త్వరలోనే మార్కెట్‌లోకి వదలబోతున్నారు. ఇక జియో డీటీహెచ్ సేవల నెలవారి బిల్లు అతి తక్కువగా ఉండబోతన్నాయి. కేవలం 49 రూపాయల మంత్లీ రీచార్జ్ నుండీ జియో డీటీహెచ్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. డీటీహెచ్ సేవల కోసం ప్రస్తుతం జనాలు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు.
అయితే జియో ఆ ఖర్చులో కేవలం 25 శాతంతో రానుందట. ప్రారంభ ఆఫర్‌గా ఆరు నెలలు లేదా సంవత్సరం పాటు కొన్ని ముఖ్యమైన ఛానెల్స్‌ను ఫ్రీగా అందించనున్నట్లుగా తెలుస్తోంది. జియో డీటీహెచ్ రంగంలోకి ప్రవేశిస్తే ప్రస్తుత ఆపరేటర్లతో పాటు, కేబుల్ ఆపరేటర్లకు కూడా గడ్డు కాలం తప్పదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.