9 నెలల బ్రేక్‌కు కారణం ఇదే.. సంతోషంగా ఉంది!

parineeti chopraబాలీవుడ్‌లో కొన్ని సినిమాలతోనే స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ పరిణితి చోప్రా. ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోతో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. ఆమె పర్సనాలిటీ కాస్త ఎక్కువ ఉండటంతో పాటు, నటన పరంగా పరిణితి సాధించాలనే ఉద్దేశ్యంతో పరిణితి చోప్రా దాదాపు సంవత్సర కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఎట్టకేలకు పరిణితి చోప్రా కొత్త లుక్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ‘మేరీ ప్యారీ బింధు’ అనే చిత్రంలో నటిస్తుంది. ఆ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న పరిణితి చోప్రా సన్నగా, మరింత అందంగా కనిపిస్తుంది. ఈ సందర్బంగా పరిణితి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సమయంలో 9 నెలలు సినిమాలకు దూరంగా ఉండటం అంటే కాస్త కష్టమే అయ్యింది. అయితే తనను తాను మార్చుకోవడం కోసం తప్పలేదు అని, ఇప్పుడు తనలో చాలా పరిణితి వచ్చిందని, అలాగే తన శరీరం కూడా అందంగా తయారైందని, ఈ గ్యాప్‌లో చాలా విషయాలు నేర్చుకున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.