లా చదివేందుకు లండన్‌ వెళ్లనున్న ‘గురు’!!

venkyవిభిన్న పాత్రలు, వైవిధ్యభరిత కథలు ఎంచుకుని సినిమా చేసే హీరో వెంకటేష్‌. కెరీర్‌లో వెంకటేష్‌ ఎన్ని ప్రయోగాలు చేశాడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో రీ మేక్‌ చిత్రాలు చేసి ఘన విజయాలు సాధించిన వెంకటేష్‌ తాజాగా కూడా బాలీవుడ్‌ చిత్రం ‘సాలా ఖదూస్‌’ చిత్రాన్ని తెలుగులో ‘గురు’గా రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా విజయం సాధించడంతో వెంకీ మరిన్ని ప్రయోగాలకు సిద్దం అవుతున్నాడు.

1924లో మొక్కపాటి నరసింహ శాస్త్రి అనే రచయిత రచించిన ‘బారిస్టర్‌ పార్వతీశం’ తెలుగు వారికి సుపరిచితం. ఆ కథలో పార్వతీశం లా చదివేందుకు లండన్‌ వెళ్తాడు. అక్కడ ఆయన పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందుల అన్ని ఇన్నీ కావు. ఎంటర్‌టైనర్‌గా సాగే ఆ నవల ఆధారంగా వెంకటేష్‌ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. ప్రముఖ దర్శకుడు ఈ నవలతో వెంకీ వద్దకు వెళ్లడం, వెంకీ ఆపాత్రలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందట. అయితే ఎప్పుడు ఆ సినిమా ప్రారంభం అయ్యేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం.Barrister Parvateesam