కొన్ని సినిమాల్లో చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. అయితే పెద్ద సినిమాల్లో మాత్రం సిల్లీ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడతారు. అయితే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో కూడా కొన్ని సిలీ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైర్‌లో భల్లాల దేవుడి తండ్రి అయిన బిజ్జల దేవుడు కోపంతో గోడను గుద్దడం, ఆ గోడ కూలడం కనిపించిన విషయం తెల్సిందే. ఆ సీన్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక ఆ సీన్‌లో ఒక పెద్ద తప్పు కనిపించింది.
బిజ్జల దేవుడికి మొదటి పార్ట్‌లో కుడి చేయి సరిగా లేదు. అయితే సెకండ్ పార్ట్‌కు వచ్చే సరికి బిజ్జల దేవుడు కుడి చేయితో గోడను బద్దలు కొడుతున్నాడు. ఎడమ చేయి మాత్రం అవిటిగా ఉంది. మొదటి పార్ట్‌లో అలా, రెండవ పార్ట్‌లో ఇలా కావాలని చూపించాడా లే తప్పు జరిగిపోయిందా అనేది చూడాలి. చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని నిర్థారించాల్సి ఉంటుంది. ఒక వేళ రాజమౌళి పొరపాటున ఇలా చేస్తే అది పెద్ద బ్లండర్‌గా చెప్పుకోవాలి.