తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన చిత్రం ‘బాహుబలి’. టాలీవుడ్ జక్కన్న ఈ చిత్రాన్ని ఒక చిన్న చిత్రంగా ప్రారంభించి రెండు పార్ట్‌లుగా విడదీసి, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. రెండు పార్ట్‌లలో కూడా నటించిన నటీ నటులకు భారీ క్రేజ్ దక్కింది. ఈ చిత్రంలో నటించిన వారికి పారితోషికంతో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా భారీ ఆఫర్లు వస్తున్నాయి. బాహుబలిగా నటించిన ప్రభాస్ తర్వాత అత్యంత కీలకమైన పాత్ర అయిన భల్లాలదేవ పాత్రను రానా పోషించిన విషయం తెల్సిందే.
హీరోగా కెరీర్ నిలదొక్కుకుంటున్న సమయంలో రానా ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. హీరో అవ్వాల్సిన రానా విలన్ ఏంటని కొందరు ముక్కున వేలేసుకున్నారు. అయితే రాజమౌళిపై నమ్మకంతో రానా ఈ సినిమాను ఒప్పుకున్నాడు. ఈ సినిమా సమయంలో ఆయన హీరోగా ఒక్క సినిమాకు రెండు కోట్ల నుండి రెండున్నర కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అలాంటి రానా ‘బాహుబలి’ రెండు పార్ట్‌లకు కలిపి ఏకంగా 24 కోట్ల పారితోషికం అందుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రానా కెరీర్ ఆరంభించినప్పటి నుండి వచ్చిన అన్ని సినిమాల పారితోషికాలు కలిపినా కూడా ‘బాహుబలి’ సినిమాకు వచ్చిన పారితోషికంతో సమానం కాకపోవచ్చు అని సినీ వర్గాల వారు అంటున్నారు. అలాగే రానాకు బాహుబలి చిత్రం తర్వాత బాలీవుడ్ రేంజ్లో మంచి గుర్తింపు దక్కింది.