డేటా స్పీడ్‌లో జియోనే నెం.1

jio net speedభారత టెలికాం రంగంలో సునామిలా దూసుకు వచ్చిన జియో పోటీని తప్పించుకునేందుకు, జియోకు పోటీగా నిలిచేందుకు, తన నెం.1 స్థానంను కాపాడుకునేందుకు ఎయిర్‌టెల్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జియో ఆఫర్స్‌కు పోటీగా భారీ ఆఫర్స్‌ను ఎయిర్‌టెల్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక జియో డేటా స్పీడ్‌ కంటే తాము అందించిన డేటా స్పీడ్‌ ఎక్కువ అని ఒక అంతర్జాతీయ సంస్థతో చెప్పించింది. ఆ సంస్థను మ్యానేజ్‌ చేయడం వల్ల వారు జియో కంటే ఎయిర్‌టెల్‌ అధిక స్పీడ్‌తో నెట్‌ను వినియోగదారులకు అందిస్తుందని చెప్పింది.

జియో ఆ వాదనను కొట్టి పారేసింది. తమ కంటే ఎక్కువ స్పీడ్‌తో ఈ దేశంలో డేటాను ఇవ్వడం ఎవరికి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇక జియో వాదనను బలపర్చుతు టెలిఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇండియాస్‌ బెస్ట్‌ డేటా స్పీడ్‌ టెలికాం సంస్థ ఏది అని తేల్చి చెప్పింది. ట్రాయ్‌ తన నివేదికను అధికారిక వెబ్‌ సైట్‌లో ఉంచడం జరిగింది. రిలయన్స్‌ జియో 15.04 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటాను అందిస్తుంది. ఇక ఎయిర్‌టెల్‌ 11.93 ఎంబీపీఎస్‌తో డేటాను వినియోగదారులకు అందిస్తుంది. ఈ ప్రకటనతో జియోపై వినియోగదారుల్లో మరింత నమ్మకం పెరిగినట్లయ్యింది. ఎయిర్‌టెల్‌ ట్రాప్‌ ప్రకటనపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.