తమిళనాట ప్రస్తుతం జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందడి నెలకొన్ని ఉన్న విషయం తెల్సిందే. జైల్లో ఉండి కూడా శశికళ తన వారికి మార్గదర్శకాలు జారీ చేస్తూ ఆర్కే నగర్‌లో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో శశికళ వర్గంకు అన్నాడీఎంకే అధికార చిహ్నం అయిన రెండాకులు దక్కలేదు. ఆ గుర్తు కోసం పన్నీర్ సెల్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో వివాదం తేలే వరకు ఆ గుర్తును హోల్డ్‌లో ఉంచాలని ఈసీ నిర్ణయించింది. అందుకే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఇరు వర్గాల వారికి రెండు వేరు వేరు గుర్తులను కేటాయించడం జరిగింది.
తాజాగా ఎన్నికల కమీషన్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అన్నాడీఎంకే అధికార చిహ్నం అయిన రెండాకుల గుర్తును శశికళ వర్గం ఎక్కడ కూడా వాడకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అన్నాడీఎంకే అధికారిక వెబ్ సైట్ మరియు సోషల్ మీడియా పేజ్‌లలో కూడా ఈ రెండాకుల గుర్తును తీసేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంత శశికల వర్గంకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది. త్వరలోనే ఈసి రెండాకుల గుర్తును తమకు కేటాయిస్తుందనే నమ్మకం ఉందని పన్నీర్ సెల్వం వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.