టీం ఇండియాకు ఎన్నో అద్బుత విజయాలను అందించి, మరపురాని విజయాలను తన ఖాతాలో వేసుకున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా గల్ఫ్ ఆయిల్ ఇండియా కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. నేడు ముంబయిలోని ఆయిల్ ఇండియా కంపెనీ ప్రధాన కార్యయంలో ధోని బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్బంగా ధోని తన క్రికెట్ జర్సీని వదిలేసి బ్లూ సూట్ మరియు టై కనిపించాడు.
2011 నుండి కూడా సదరు కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోని సీఈఓ కాబోతున్న విషయాన్ని కంపెనీలోని ఉద్యోగస్తులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. ధోని ఆఫీస్‌లోకి అడుగు పెట్టిన తర్వాతే అందరికి తెలిసింది. కంపెనీ సీఈఓగా మొదటి రోజు ధోని పలు మీటింగ్స్‌కు హాజరు అయ్యారు, అలాగే కంపెనీ ఉన్నతోద్యోగులతో కూడా సమావేశం అయ్యాడు. ఈ సందర్బంగా కంపెనీ గురించిన కొన్ని కీలక నిర్ణయాలు కూడా ధోని తీసుకున్నట్లుగా కంపెనీ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ధోని ఐపీఎల్లో ఈ సంవత్సరం రైసింగ్ పూణె తరపున ఆడబోతున్నాడు.