నందమూరి బాలకృష్ణ సినిమాలో లక్స్ పాప లక్స్ పాప లంచ్‌కొస్తావా.. అంటూ హాట్ సాంగ్ చేసి అదరగొట్టిన ఆశా సైనీ గుర్తుంది కదా, అదేనండి ఇప్పుడు ఆమె పేరు మార్చుకుని ఫ్లోరా సైనీ అయ్యింది. సౌత్‌లో పెద్దగా ఆఫర్లు లేకుండా పోవడంతో ఈ అమ్మడు బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తుంది. ఇటీవల ఈ అమ్మడు ధనక్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమాలో ఈమె మంచి నటనతో ఆకట్టుకుంది.
ఆ సినిమాతో మంచి పేరు రావడంతో బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘బేగం జాన్’ చిత్రంలో ముఖ్య పాత్రకు ఎంపిక అయ్యింది. విద్యాబాలన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాపై ఫ్లోరా సైనీ సెక్స్ వర్కర్‌గా నటించింది. విద్యాబాలన్ బ్రోతల్ హౌస్ ఓనర్‌గా నటించిన విషయం తెల్సిందే. అవకాశాలు లేని ఫ్లోరా సైనీ సెక్స్ వర్కర్ పాత్రకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.