త్వరలో శ్రియ భూపాల్‌ పెళ్లి, అఖిల్‌తో కాదు!

sriya bhupalఅక్కినేని వారి ఇంట అన్ని అనుకున్నట్లుగా జరిగితే అఖిల్‌, శ్రియ భూపాల్‌ల పెళ్లి జరగాల్సి ఉంది. కాని ప్రేమించి పెళ్లికి సిద్దం అయిన అఖిల్‌, శ్రియ భూపాల్‌లు నిశ్చితార్థం అయిన తర్వాత విడిపోయారు. వీరిద్దరు కలిసి నిండు నూరేళ్లు జీవితం గడపాలని భావించి నిశ్చితార్థం కాగానే, పెళ్లికి ముందే విడిపోయారు. పెళ్లి క్యాన్సిల్‌కు ఇప్పటి వరకు సరైన కారణం ఏంటో తెలియరాలేదు. ఈ సమయంలోనే అఖిల్‌ సినిమాపై దృష్టి పెట్టగా, శ్రియ వ్యాపారాల్లో తలమునకలై ఉంది.

జీవీకే మనవరాలు అయిన శ్రియ భూపాల్‌ పెళ్లి వెంటనే చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పెళ్లి క్యాన్సిల్‌ అవ్వడంతో అఖిల్‌ కంటే బెస్ట్‌ సంబంధం శ్రియకు జీవీకే ఫ్యామిలీ చూస్తుంది. ఇప్పటికే అమెరికాలో ప్రముఖ వ్యాపార వేత్త కుమారుడితో శ్రియ వివాహం జరిపించేందుకు చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. అది ఓకే అయితే త్వరలోనే అఖిల్‌ మాజీ లవర్‌ పెళ్లి ఎన్నారై కుర్రాడితో జరుగనుంది. మరి అఖిల్‌ పెళ్లి ఎప్పుడు అనేది చూడాలి.