అయోద్యలో రామ మందిరంకు ఎన్నో అనుకూల అంశాలు

ayodhya ram mandir soonఎన్నో సంవత్సరాలుగా దేశంలో అత్యంత సున్నిత సమస్యగా కొనసాగుతూ వస్తున్న అయోద్యలో రామ మందిర నిర్మాణ అంశంకు త్వరలోనే పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో ఏర్పడటంతో పాటు, యోగి ఆదిత్యనాధ్‌ వంటి హిందుత్వ వాది సీఎం అవ్వడంతో రామ మందిర నిర్మాణ ప్రారంభం అయినట్లుగానే హిందువులు భావిస్తున్నారు. యూపీ ఎన్నికల సమయంలో బీజేపీ తమ మేనిఫెస్టోలో రామమందిర అంశంను చేర్చడం జరిగింది.

మరో వైపు రామమందిరంకు ముస్లీంల నుండి కూడా సానుకూల స్పందన వస్తుంది. పలు ముస్లీం సంఘాలు మరియు ముస్లీం పెద్దలు కూడా అయోద్యలో రామమందిరంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదు అని, హిందువులు పవిత్రంగా భావించే అయోద్యలో రామ మందిరం నిర్మించాల్సిందిగా వారు కోరుతున్నారు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే అతి త్వరలోనే రామ మందిర నిర్మాణంకు అంకురార్పణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు బీజేపీ మాత్రం ఒక రూట్‌ మ్యాప్‌ను ప్రకటించలేదు. ఇప్పుడే కదా ప్రభుత్వం ఏర్పడినది, కాస్త సమయం ఇవ్వండి అంటూ యూపీ బీజేపీ నేత ఒకరు రామ మందిరం గురించి మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చారు.