అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు తీరనున్నాయా?

pawan kalyan agri goldవేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజల నుండి వసూళ్లు చేసి, బోర్డు తిప్పేసిన అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులు కోర్టు కేసుల్లో ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. తాజాగా అసెంబ్లీలో ఈ విషయమై అధికార మరియు ప్రతిపక్ష పార్టీల మద్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే పవన్‌ కళ్యాణ్‌ కూడా అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటాను అంటూ ముందుకు వచ్చాడు.

నేడు విజయవాడలో పవన్‌ కళ్యాణ్‌ అగ్రిగోల్డ్‌ బాధితులతో ముఖా ముఖి నిర్వహించాడు. ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని, వెంటనే ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం కొంత మేరకు అయినా నిధులు విడుదల చేయాల్సిందిగా కోరాడు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉందని ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఉద్యమంలోకి దిగడంతో ప్రభుత్వం దిగి రావడం ఖాయం, అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి తమకు న్యాయం జరగడం ఖాయం అంటూ అగ్రిగోల్డ్‌ బాధితుల్లో ఏదో ఒక మూల ఆనందం వ్యక్తం అవుతుంది. మరి పవన్‌ వారి కష్టాలను తీర్చుతాడా అనేది చూడాలి.