చేనేత వస్త్రాల్లో మెరిసిపోతున్న చిన్నది

samanthaటాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత హీరోయిన్‌గా చాలా బిజీగా ఉంటున్న కూడా తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. చేనేతను ప్రమోట్‌ చేయడానికి ఈ అమ్మడు చాలా కృషి చేస్తోంది. అంతేకాకుండా తాను కూడా చేనేత వస్త్రాలనే ధరిస్తోంది. తాజాగా ఓ కళాశాలలోని వేడుకకు హాజరయిన సమంత ఏకంగా చేనేత చీరలోనే దర్శణం ఇచ్చింది. సమంత నేత చీరలో అనగానే కొంత మంది పెదవి విరిచారు. ఛీ… నేత చీరలో టాప్‌ హీరోయిన్‌ ఎలా ఉంటుంది. గ్లామర్‌గా కనిపించే సమంత నేత చీరలో బావుంటుందా..?? అని అనేక సందేహాలు వచ్చాయి. కానీ నేత వస్త్రాల్లో సమంతను చూసిన తర్వాత అంతా నోరెళ్లబెట్టారు.

మోడ్రన్‌గా కనిపించడానికి గ్లామర్‌ డ్రస్‌లకు పెద్దపీఠ వేసే సమంత తాజాగా నల్లని నేత చీర కట్టుకుని దర్శణం ఇచ్చింది. నల్లని నేత చీరపై బంగారు రంగు అంచుతో పాటు చీర మొత్తం తీగలలాంటి డిజైన్‌ ఉంది. ఇక ఆ చీరను కట్టుకున్న సమంత ఎంత అందంగా కనిపించింది అంటే చీర వల్ల సమంత అందంగా కనిపిస్తుంది.

సమంత వల్ల ఆ చీర కూడా చాలా అందంగా కనిపిస్తుంది. నేత చీరలో సమంత మెరిసిపోతు అందరికి షాకిచ్చింది. చేనేత వస్త్రాలో మెరిసిపోతున్న ఈ అమ్మడిని చూసి చాలామంది కూడా నేత వస్త్రాలను వాడడానికి ఆసక్తి చూపుతారు కాబోలు. నేత చీరలో అక్కినేని వారి కోడు అదర్స్‌.