టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్ర రెండో భాగం ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఇదివరకు ఈ చిత్రానికి జరపని విధంగా ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు చిత్ర యూనిట్. ఎంతో సమయం వెచ్చించాలని వచ్చిన యూనిట్ సభ్యులకు మాట్లాడే సమయం ఎక్కువ లేకుండా పోయింది. ఇక చివరకు అంత హడావుడిగా కానిచ్చేశారు. ప్రీ రిలీజ్ వేడుక పూర్తి అయ్యి ప్యాక్ అయ్యే సమయంలో దర్శకుడు రాజమౌళి నోట సెల్ఫీ అని వినిపిచ్చింది. ఇక స్టేజి మీద ఉన్న వారంతా కూడా సెల్ఫీ కోసం సర్దుకున్నారు. ఎక్కడివారు అక్కడ అలాగే ఫిక్స్ అయ్యి సెల్ఫీకి ఫోజ్ ఇచ్చారు.
రాజమౌళి నోట సెల్ఫీ అనగానే ‘బాహుబలి’ చిత్ర డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి సెంథిల్ తన ఫోన్‌లో సెల్ఫీని క్లిక్ మనిపించాడు. ఇక ఆ సెల్ఫీలో ఏకంగా ఏందొమ్మిది మంది ఉన్నారు. ఒక్కరి తల కూడా కట్ కాకుండా పందొమ్మిది మందిని అంత చిన్న ప్రేమ్‌లో బంధించాడు సెంథిల్. ఈ సెల్ఫీని చూస్తేనే ఆయన టాలెంట్ ఏంటో చాలా సుభంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి అంత హడావుడిలో కూడా ‘బాహుబలి’ యూనిట్ అంతా కలిసి పందొమ్మిది మందితో అరుదైన సెల్ఫీని తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తోంది.