తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో విపక్ష పార్టీలకు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని, ప్రభుత్వం విపక్ష పార్టీలను మాట్లాడకుండా చేస్తుంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వ్యవహారా మంత్రి హరీష్ రావు నేడు సభలో ఈ విషయమై మాట్లాడారు. సభ్యులకు ఎంత వరకు మైక్ ఇవ్వాలో, ఇస్తున్నామని, ప్రతి ఒక్క సభ్యుడు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు టైం ఇస్తున్నామని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
ఇంకా హరీష్ రావు మాట్లాడుతూ పక్క రాష్ట్రం ఏపీలో అసెంబ్లీలో ప్రతిపక్షం వైకాపాకు అస్సలు మైక్ ఇవ్వకుండా అధికార పక్షం ప్రవర్తిస్తున్న తీరు గుర్తించాలని, అలా మేము చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. తెలంగాణ అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీ ప్రస్థావన తీసుకు రావడంతో హాట్ టాపిక్ అయ్యింది. హరీష్ రావు కామెంట్స్‌పై ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపాకు ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం మా ప్రభుత్వం ఇస్తుందని ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు.