మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాన్ని తొలి స్వాతంత్ర సమరయోధుడైన ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవిత చరిత్రతో తెరకెక్కించనున్నారు. గతంలో ఈ చిత్రాన్ని స్క్రిప్టు వరకు తీసుకుపోయిన చిరు పలు కారణాల వల్ల అప్పుడు ప్రాజెక్ట్ అటకెక్కింది. తాజాగా అదే కథతో కొత్తగా స్క్రిప్టును రెడీ చేయించి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి చిరు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో చిరు ఎలా ఉండబోతున్నాడో లుక్ను కూడా ఆర్ట్ వేయించి దానిని ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో చిరు ఉయ్యావాడ లుక్కోసం అనువైన విధంగా తయారుకావడానికి ఇప్పటికే కసరత్తులు మొదలెట్టాడు.
‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథలో ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. అయితే ఈ చిత్రంలో కూడా ముగ్గురు కథానాయికలను ఎంపిక చేయాల్సి ఉంది కానీ చిరు కోసం ముగ్గురు హీరోయిన్లు కావాలంటే కాస్త కష్టమైన పనే. కానీ ఇది ఒక చారిత్రక సినిమా కాబట్టి కాస్త మసాలా కూడా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందుకే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను దించితే బాగుంటుంది అని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. కానీ ముగ్గురు హీరోయిన్లు చిరుకు దొరకడం గగనమే. ఒకవేళ ముగ్గురు దొరకకపోతే ఇద్దరితోనే ఒక్కరితోనో సరిపెట్టడానికి కూడా రెడీ అయ్యారట. పవర్ఫుల్గా సాగే ఈ చిత్రంలో చిరు ముగ్గురు హీరోయిన్ల సరసన నటిస్తే అది కూడా చాలా ప్లస్ అవుతుందని అభిమానుల నుండి కూడా మంచి స్పందన వస్తోంది.