పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తోంది. పవన్‌కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్నా కూడా పవన్ నిన్న మొత్తం తన కూతురు ఆద్యతోనే గడిపి వచ్చాడు. పవన్ కూతురు ఆద్య పుట్టిన రోజు కావడంతో నిన్న పూర్తి రోజును కేటాయించుకుని కూతురుతోనే గడిపాడు పవన్.
పిల్లలంటే ప్రాణం ఇచ్చే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌తో విడిపోయినా కూడా తరుచూ పిల్లలను కలుస్తూ, వారితో సమయాన్ని గడుపుతూ ఉంటాడు. తాజాగా ఆద్య పుట్టిన రోజు సందర్భంగా ఆద్య స్కూలుకు వెళ్లి అక్కడ బర్త్‌డే వేడుకను జరిపాడు. ఆ వేడుకలో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కూడా పవన్ పక్కన ఉన్నారు. పవన్ కూతురుతో కలిసి సంతోషంగా గడుపుతున్న వేళ క్లిక్‌మనిపించిన దృశ్యాలను రేణు దేశాయ్ పిల్లలు పుట్టిర రోజున వారికోసం సమయాన్ని కేటాయించడమే వారికిచ్చే విలువైన బహుమతి అని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి మీకోసం…