త్రిషకు ఏం కాలేదు, బాగానే ఉంది బాబోయ్‌

trishaముదురుభామ త్రిషకు ప్రస్తుతం కెరియర్‌ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకున్నా కూడా అడపా దడపా చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఈ అమ్మడు బాలయ్య చిత్రం ‘యన్‌’లో కనిపించిన తర్వాత మరోసారి కనిపించలేదు. ఈ ముదురుభామ కెరియర్‌ బండి కాస్త స్లో అవుతున్న సమయంలో ఈమెపై షాకింగ్‌ వార్త ఒకటి జోరుగా ప్రచారం అవుతూ వస్తోంది. తాజాగా చెన్నై నుండి హైద్రాబాద్‌ వస్తున్న త్రిషకు అనారోగ్యం ఏర్పడిరది. వెంటనే త్రిషను హైద్రాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించారు అని వార్తలు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం అయ్యాయి.

ఈ వార్తలు విన్న ఆమె సన్నిహితులు, అభిమానులు కంగారు పడి విషయాన్ని ఆరా తీశారు. దాంతో ఈ వార్తలపై త్రిష తల్లి ఉమాకృష్ణన్‌ స్పందించింది. నా కూతురి ఆరోగ్యం బాగానే ఉంది, త్రిషకు ఏం కాలేదు, తన పూర్తి ఆరోగ్యంతోనే ఉండి సినిమాల్లో బిజీగా ఉంది, తను బాగానే ఉంది బాబోయ్‌లిక ఆపండి అంటూ త్రిష ఆరోగ్యంపై వస్తున్న పుకార్లుకు చెక్‌ పెట్టింది. ఒక్కసారిగా త్రిష ఆరోగ్యం చెడిరది అనే వార్తలు రాగానే అభిమానులు కంగారు పడి మీడియా వారికి ఫోన్‌ చేయడం ప్రారంభించారు. దాంతో త్రిష తల్లి వెంటనే స్పందించి ఆమె బాగానే ఉందని క్లారిటీ ఇచ్చింది.