ప్రముఖ టీవీ ఛానెల్‌లలో పలు కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ తనదైన రీతిలో అందాలను ఆరబోస్తూ హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి అవకాశం వచ్చినప్పుడల్లా వెండి తెర మీద కనిపించడానికి కూడా సిద్దంగానే ఉంది. ఇప్పటికే పలు చిత్రాలతో పెద్ద తెర మీదకు వచ్చి ఆకట్టుకున్న శ్రీముఖి ప్రస్తుతం ‘బాబు బాగా బిజీ’ చిత్రంలో నటిస్తుంది.
అడల్ట్ కంటెంట్‌తో తెనకెక్కిన బాలీవుడ్ ‘హంటర్’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా శ్రీముఖి, తేజస్విలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రీ లుక్, ఫస్ట్‌లుక్‌లను చూస్తుంటే ఇందులో ఎంత మసాలా ఉందో అందరికి అర్థమయ్యింది.
ఇంత ఘాటు చిత్రంలో నటిస్తున్నందుకు నటీనటులపై కొంత దుష్ప్రచారం కూడా జరగుతోంది. తాజాగా మీడియా కంటబడిన శ్రీముఖిని మీడియా ప్రతినిధి ఈ చిత్రంలో నటిస్తున్నందుకు మీపై అభిమానులకు చెడు అభిప్రాయం కలుగుతుందేమో అని అడిగారు. దాంతో శ్రీముఖి ఛీ.. ఛీ.. నేను అలాంటి పాత్రలో నటించడం లేదు, అసభ్యకర సన్నివేశాల్లో నేను అస్సలు నటించడం లేదు, హీరోను సరైన దారిలో పెట్టడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉండే మంచి పాత్ర నాది, నేను అలాంటి పాత్రల్లో అసలే నటించను అంటూ శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. మొదటగా నాది గొప్ప పాత్ర, కీలక పాత్ర అని చెప్పిన వారు తెరపై ఎంత తెగిస్తారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.