తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. భారీ అంచనాలున్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంపై ఉన్న అంచనాల రిత్యా ఈ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో కూడా భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడం జరిగింది. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియోరైట్స్ ఇంకా ఆన్‌రైట్స్ ఇలా అన్ని రైట్స్‌కు కలిపి ‘కాటమరాయుడు’ విడుదలకు ముందే 115 కోట్లను నిర్మాత ఖాతాలో వేసినట్లుగా తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం వల్ల నిర్మాతకు నష్టాలు వచ్చాయి. దాంతో ఈసారి తక్కువ బడ్జెట్‌తో చిత్రాన్ని చేయాలని పవన్ భావించి కేవలం 30 కోట్ల బడ్జెట్‌తోనే ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది. పవన్ పారితోషికం కాకుండా 30 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కడంతో లాభాల పంట పండినట్లయ్యింది.
విడుదలకు ముందే ఈ సినిమా ఏకంగా 85 కోట్ల టేబుల్ ప్రాఫిట్‌ను ఈ చిత్రం దక్కించుకుంది. లాభాల్లో 60 శాతం వాటాను పవన్ కళ్యాణ్ పారితోషికంగా అందుకోబోతున్నాడు. అంటే పవన్ పారితోషికం 50 కోట్ల పై మాటే అని సినీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి కాటమరాయుడు లెక్కలు చూస్తే ట్రేడ్ పండితులకు కూడా మతి పోయినంత పనైతుందట. బాహుబలి తర్వాత అత్యధిక లాభాలను దక్కించుకున్న చిత్రంగా ఇది నిలుస్తుందని కూడా అంటున్నారు.