బాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రాణి ముఖర్జీ ఆదిత్యచోప్రాను పెళ్లాడిన తర్వాత కూడా అడపాదడపా సినిమాలను చేస్తూనే ఉంది. ఏ మాత్రం విరామం ఇవ్వకుండా ఈ అమ్మడు పెళ్లి తర్వాత వెంటనే సినిమాల్లో నటించినా కూడా రాణి ముఖర్జీకి చెప్పుకోదగ్గ హిట్ ఏది దక్కలేదు. రాణిముఖర్జీకి ఒక పాప కూడా పుట్టింది. అయితే ఆ పాపను ఎక్కువగా మీడియా కంటబడనివ్వదు. పాపను మీడియా వారు ఫొటోలు తీయకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. దాంతో ఈమె అభిమానులు పాపను చూడడం కోసం తహతహలాడుతున్నారు.
ఈ అమ్మడు ఒకేసారి మాత్రమే తన కూతురు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఈమె అభిమాని ఒకరు మీ పాప లేటెస్ట్ ఫొటోలు ఎందుకు షేర్ చేయరు అంటూ కామెంట్ విసిరాడట. దాంతో ఈ అమ్మడు ఆ కామెంట్‌కు స్పందించి పాపను ఫొటో తీసి, ఇంత చిన్నప్పుడే రచ్చ చేయడం మా ఆయనకు ఇష్టం ఉండదు, అందుకే నేను పాప ఫొటోను షేర్ చేయడానికి సంకోచిస్తాను, మా ఆయనకు నచ్చదు కాబట్టి పాప ఫొటోను పోస్ట్ చేయను, అలా ఆయనకు నచ్చదు కాబట్టి దూరంగా ఉంటాం అంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి రాణి ముఖర్జీ భర్త అడుగు జాడల్లో నడుచుకుంటు మంచి భార్యగా నిరూపించుకుంటుంది.