సినిమాలు వదిలేసి అలా చేయాలని ఉంది కానీ..

ram charanమెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, నిర్మాతగా మంచి సక్సెస్‌ మీదున్నాడు. ఈయన త్వరలో సుకుమార్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చరణ్‌ తాజాగా విజయనగరంలోని ఓ కాలేజీలో జరుగుతున్న వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా మాట్లాడిన చరణ్‌ విద్యార్థులను ఉత్తేజవంతంగా చేసేలా మాట్లాడాడు. తనకు విద్యార్థులు అంటే చాలా ఇష్టమని, విద్యార్థి దశ చాలా గొప్పది అని, ఎంతటి అన్యాయంను అయినా విద్యార్థులు ధైర్యంగా ప్రశ్నించే హక్కు ఉందని చరణ్‌ వ్యాఖ్యానించాడు.

సినిమాల వల్ల తాను బీకాంను మధ్యలోనే ఆపేశానని, వీలుంటే ఒక సంవత్సరం సినిమాలు ఆపేసి చదువు పూర్తి చేయాలి అనిపిస్తుంది అని చెర్రీ చెప్పుకొచ్చాడు. అవకాశం ఉంటే కచ్చితంగా సినిమాలు వదిలేసి అలా చేస్తాను కానీ మవుతందో అంటూ వ్యాఖ్యానించాడు.

అనంతరం విద్యార్థి దశ చాలా గొప్పది, ఎవరినైనా శిక్షించగలిగేది విద్యార్థులే, స్టూడెంట్స్‌ తలుచుకుంటే సూపర్‌స్టార్స్‌, మెగాస్టార్స్‌ను కూడా తయారు చేస్తారు. ఏ పార్టీని అయినా అధికారంలో నిలబెట్టగలరు, ఇలాగే మీ ధైర్యాన్ని మంచి పనులకు ఉపయోగిస్తూ ముందుకు వెళ్లండి అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాడు. చరణ్‌ మాట్లాడిన మాటలకు విద్యార్థులు చాలా ఉత్సాహం చూపించి చప్పట్ల మోతతో చరణ్‌ను ప్రశంసించారు.