ఈ ఎమ్మెల్యే చాలా ఖరీదు.. చాలా ఎక్కువయ్యింది

Catherine Tresaఅల్లు అర్జున్‌ సరసన ‘సరైనోడు’ చిత్రంలో నటించి ఎమ్మెల్యేగా ఫిక్స్‌ అయిన ముద్దుగుమ్మ కేథరిన్‌ త్రెసాకు హీరోయిన్‌గా అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో ఒక పూర్తి స్థాయి ఐటెంగా మారడానికి ఈ అమ్మడు రెడీ అయ్యింది. ఈ అమ్మడికి గతంలో చిరు ‘ఖైదీ నెం. 150’ చిత్రంలో ఐటెం అవకాశం వచ్చిన తర్వాత పలు కారణాల వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. కేథరిన్‌కు తాజాగా బోయపాటి చిత్రంలో ఐటెంగా ఆడిపాడే అవకాశం వచ్చింది. దాంతో ఈ అమ్మడు వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కేవలం అవకాశం మాత్రమే కాకుండా భారీ మొత్తంలో పైకం కూడా ముట్టింది. సహజంగా కేథరిన్‌ పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటిస్తేనే 30లక్షలు ఇవ్వడం గగనం. అలాంటిది కేవలం బోయపాటి చిత్రంలో ఐటెంగా చిందులేస్తేనే ఏకంగా 60లక్షల పైకం ముట్టిందట. అవును అవకాశాలు లేని సమయంలో అవకాశం మాత్రమే కాకుండా భారీ మొత్తంలో ఈ అమ్మడికి ఆఫర్‌ వచ్చింది. దాంతో ఈ ఎమ్మెల్యే ఐటెం ఖరీదు చాలా ఎక్కువే కానీ ఈమెకే అంత అవసరమా అంటూ సినీ వర్గాల వారు కాస్త పెదవి విరుపు చూపిస్తున్నారు. బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సాయిశ్రీనివాస్‌ హీరోగా నటిస్తుండగా రకుల్‌ మరియు ప్రగ్యా జైశ్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ల కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు యూనిట్‌ సభ్యులు.