చాలా తెలుగు చిత్రాల్లో నటించిన రీచా గంగోపాధ్యాయ ‘మిర్చి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈ అమ్మడు ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ పై చదువులు కొనసాగిస్తోంది. తాజాగా తెలుగు సినీ పరిశ్రమపై చాలామంది హీరోయిన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవకాశాల కోసం హీరోయిన్లు పడుకోవాల్సిందే అనే సాంప్రదాయం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉంది అని ఇటీవల చాలామంది భామలు రచ్చ చేస్తున్నారు.
హీరోయిన్లు అవకాశాల కోసం పడుకోవాల్సిందే అన్న అంశంపై రీచా తాజాగా స్పందించింది. వారు చెబుతున్నట్టు తెలుగు పరిశ్రమ అంత దారుణంగా ఉండదు. టాలీవుడ్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అక్కడ నటనతోనే అవకాశాలు ముడిపడతాయి కానీ హీరోయిన్లు పడకోవడంపై కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను తెలుగు, తమిళ భాషల్లో చాలా చిత్రాల్లో నటించాను. పెద్ద వారితో కూడా పలు చిత్రాల్లో నటించాను. నాకు ఒక్కసారి కూడా అలాంటి అనుభవం ఎదురుకాలేదు.
ఏ దర్శకనిర్మాత కాని, ఫిల్మ్ మేకర్ కాని తనతో అలా ప్రవర్తించలేదు అని ఈ అమ్మడు చెన్పుకొచ్చింది. ఆడవారిపై లైంగిక వేధింపులు సినీ పరిశ్రమలో అసలే లేవని నేను అనను. అలాని కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీని మాత్రమే తప్పుబడితే ఊరుకోను. ఈ మధ్య కాలంలో అన్ని రంగాలలో కూడా ఆడవారిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది.
ఆడవారు ధృడంగా ఉంటే ఎవరు కూడా అడ్వాన్స్ కారు అని, ఆడవారు బెండ్ అయితేనే మగవారు అడ్వాన్స్ అవుతారు అని ఇది కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని పరిశ్రమలలో కూడా ఉంది అంటూ ‘మిర్చి’ భామ రిచా షాకింగ్ కామెంట్స్ చేసింది.