భూమ విషయంలో వైకాపా తీరుపై విమర్శలు

ysrcpనంద్యాల ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డి మరణంకు నేడు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెల్సిందే. సంతాప తీర్మానం సమయంలో సభలో వైకాపా లేక పోవడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తుంది. వైకాపా ఇలాంటి సమయంలో రాజకీయం చేసిందని టీడీపీ నాయకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక భూమ నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియ అసెంబ్లీలో మాట్లాడుతూ వైకాపా అధినేత జగన్‌ గారు మా తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నించింది.

రాజకీయ విశ్లేషకులు కూడా జగన్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ మారినంత మాత్రాన ఒక వ్యక్తి మృతికి సంతాపం ప్రకటిస్తున్న సమయంలో సభలో లేకుండా పోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ బయట భూమ గురించి మాట్లాడిన వైకాపా ఎందుకు అసెంబ్లీలో మాట్లాడేందుకు ముందుకు రాలేదు అనేది ఆ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాలిన అవసరం ఉందని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలతో జగన్‌ విమర్శల పాలయ్యాడు. దీనిని హైలైట్‌ చేసేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పకే సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ సంఘటనతో వైకాపా అధినేత జగన్‌ తీరు ఏంటో, నా శైలి ఏంటో ప్రజలకు అర్థం అయ్యిందని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి భూమ విషయంలో జగన్‌ తీరును ఆ పార్టీకి చెందిన వారు కూడా కొందరు ఆక్షేపిస్తున్నారు.