సహజనటి జయసుధ భర్త నితిన్ కపూర్ ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెల్సిందే. ముంబయిలో నితిన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ముంబయిలోని తన సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆరు అంతస్తుల భవనం ఎక్కి దూకినట్లుగా పోలీసులు వెళ్లడి చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నితిన్ కపూర్ది ఆత్మహత్య అని తేల్చి చెప్పారు.
గతంలో కూడా నితిన్ కపూర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే కుటుంబ సభ్యులు ఆ సమయంలో సకాలంలో స్పందించడంతో ఆయన్ను కాపాడారు. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నితిన్ కపూర్ ఇప్పుడు మరోసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈసారి మాత్రం కుటుంబ సభ్యులు ఆయన్ను కాపాడలేక పోయారు. నితిన్ కపూర్ మరణించిన సమయంలో జయసుధ ముంబయిలోనే ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా నితిన్ కపూర్ సైకియాట్రిస్టు వద్ద చికిత్స పొందుతున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. బాలీవుడ్ ప్రముఖులు మరియు ఆయన బంధువులు మరణంకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.