పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామిన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సక్సెస్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా నిర్మాతల ఖాతాలో లాభాలు దండిగా పడటం చాలా కామన్. ఓపెనింగ్స్‌తోనే రికార్డులు బద్దలు కొట్టగల సత్తా ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ ఉగాది కానుకగా భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు డాలీ దర్శకత్వం వహించగా, శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 18న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని నిర్మించిన శరత్ మరార్ ఆ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేక పోయింది. కారణం ఆ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించడమే. అందుకే ఈ సినిమాకు కాస్త తగ్గించి బడ్జెట్‌ను పెట్టినట్లుగా తెలుస్తోంది. పవన్ పారితోషికం కాకుండా ఈ సినిమా మొత్తాన్ని 25 కోట్ల లోపు బడ్జెట్‌తోనే పూర్తి చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ మొత్తంను పవన్స్టార్కు ఉన్న క్రేజ్‌తో కేవలం ప్రీమియర్ షోలతోనే రాబట్టే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు మరియు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో బెన్ ఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు ప్రదర్శించేందుకు అనుమతులు తీసుకుంటున్నారు. ఇక ఓవర్సీస్లో భారీ స్థాయిలో ప్రీ మియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇలా ప్రీమియర్ షోలతోనే భారీగా వసూళ్లు దండుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లను కూడా పెంచబోతున్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితి చూస్తుంటే కేవలం వారం రోజుల్లోనే వంద కోట్లను కాటమరాయుడు వసూళ్లు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.