పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ ఎప్పుడు ఏదో ఒక విధంగా పవన్‌ను తుచుకుంటూనే ఉంటుంది. ఆయనపై తనకు ఇంకా ప్రేమ ఉందని చెబుతూనే ఒక భర్తగా ఆయన ఫెయిల్ అయ్యాడు అంటుంది. అయితే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు అని రేణుదేశాయ్ చెబుతూ వస్తుంది. ఇక అంత మంచి వ్యక్తితో ఈమె ఎందుకు విడాకు తీసుకుంది అనే విషయాన్ని మాత్రం ఎప్పుడు చెప్పుకొచ్చింది లేదు. అయితే త్వరలోనే ఆ విషయం వెళ్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం మరాఠీలో రేణుదేశాయ్ నిర్మాతగా కొనసాగుతుంది. ఇక తన జీవిత కథతో సినిమా తీయాలని రేణుదేశాయ్ ప్రయత్నాలు చేస్తుంది. సొంత బ్యానర్లో తానే దర్శకత్వం వహించాలని కూడా రేణుదేశాయ్ ఆశిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెబుతుంది. కాస్త ఆలస్యం అయినా తన సినిమా ప్రారంభం అవ్వనుందని, అందులో పవన్ గురించి, తాము ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే విషయం, మా ప్రేమ విషయం అన్ని కూడా చెబుతాను అంటూ రేణుదేశాయ్ పేర్కొంది. అయితే ఈ సినిమా ఎంత వరకు కార్యరూపం దాల్చుతుంది అనేది అనుమానమే అని కొందరు అంటున్నారు. రేణుదేశాయ్ సినిమా చేయాలంటే ముందు పవన్ అనుమతి తప్పనిసరి. మరి పవన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది చూడాలి.