అన్నీ వదులుకుంటేనే తెలుగులో నిలదొక్కుకోగలం

sruthi hari haranసినీ పరిశ్రమ అనగానే హీరోయిన్లను కెరియర్‌ ప్రారంభంలో ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు అనే టాక్‌ ఉంది. అయితే ఇటీవల అలాంటి విషయాలపై చాలా రచ్చనే జరుగుతోంది. తెరపై కనిపించని చాలామంది హీరోయిన్‌లు చిత్ర పరిశ్రమలో ఉండే సాంప్రదాయాల గురించి సంలచన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. తాజాగా మరో హీరోయిన్‌ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. అయితే ఈ అమ్మడు మొత్తం సినీ పరిశ్రమను కాకుండా కేవలం తెలుగు పరిశ్రమనే ఉద్దేశించి మాట్లాడటం గమనార్హం. తాజాగా మీడియాతో ముచ్చటించిన కన్నడ భామ శృతి హరిహరన్‌ తెలుగు సినీ పరిశ్రమపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాను తెలుగులోకి కారణాలు అవే అంటూ పెద్ద బాంబే పేల్చింది.

తెలుగులో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే అన్నీ వదులుకోవాని, కొత్త హీరోయిన్‌లకు తెలుగులో కనీస రక్షణ, గౌరవం ఉండదని, అవకాశాలు కావాలంటే అడిగిన వారి కోరిక తీర్చి కాంప్రమైజ్‌ అవ్వాల్సిందే అంటూ శృతి హరిహరన్‌ ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కాస్టింగ్‌ కౌచ్‌ సంస్కృతి మన దేశంలోనే ఎక్కువ అని చెప్పుకొచ్చింది. తెలుగుతో పోల్చుకుంటే కన్నడలో కాస్టింగ్‌ కౌచ్‌ చాలా తక్కువగా ఉందని, అందుకే తను ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఉండి, ఎక్కడా కాంప్రమైజ్‌ కావొద్దనే కన్నడలోనే స్థిర పడ్డాను అని తెలుగు చిత్ర పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.