నా తలపుల్లోకి సన్నీ తప్ప ఎవరూ రాలేదు

sunnyసీనియర్‌ హీరో రాజశేఖర్‌ చాలాకాలం తర్వాత ‘గరుడ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రాన్ని ‘గుంటూర్‌ టాకీస్‌’ ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఆఫీసర్‌గా నటిస్తున్న రాజశేఖర్‌ సరసన ‘విశ్వరూపం’ భామ పూజా కుమార్‌ నటిస్తుండగా శ్రద్దా దాస్‌ అదిత్‌ అరుణ్‌లు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ప్రత్యేక పాటలో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటి సన్నీలియోన్‌ నటిస్తోంది. తాజాగా ఈ విషయమై దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడాడు. ఈ పాటను పెట్టాలనుకున్నప్పుడు నా తలపుల్లోకి సన్నీ లియోన్‌ తప్ప మరెవరూ రాలేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ పాటలో నటించడానికి ఇక్కడా చాలామంది ఉన్నా కూడా నా ఊహల్లోకి వచ్చిన సన్నీలియోన్‌ పేరునే చిత్ర యూనిట్‌తో చెప్పగానే వారు కూడా వెంటనే ఒకే అన్నారు అని చెప్పుకొచ్చాడు. ఈ పాట సినిమా మొత్తానికి కీలకం కాబట్టి అందరికి బాగా తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని, సన్నీ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అవుతుందని సన్నీని ఎంపిక చేశాం అంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఇది అందరు అనుకుంటున్నట్టు ఐటెం సాంగ్‌ కాదని, కథను పరిచయం చేయడంలో భాగంగా ఉంటుంది అని, కాకపోతే సన్నీ కాస్త సెక్సీగా కనబడుతుందని, సెకండ్‌ హాఫ్‌లో ఈ ఒక్క పాట మాత్రమే ఉంటుంది అని, దీనిని కేరళలో చిత్రీకరిస్తున్నాం అంటూ ప్రవీణ్‌ సత్తార్‌ చెప్పుకొచ్చాడు.