2వ పెళ్లి విషయంలో రేణుదేశాయ్‌ కన్వ్యూజ్‌

renu desai marriageతెలుగు ప్రేక్షకులకు రేణుదేశాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పవర్‌ స్టార్‌ పవన్‌ మాజీ భార్య అయిన రేణుదేశాయ్‌ తన ఇద్దరు పిల్లలతో మహారాష్ట్రలో ఉంటుంది. పవన్‌కు దూరం అయ్యి చాలా కాలం అయినా కూడా ఆమెకు మాత్రం పవన్‌పై ప్రేమ తగ్గలేదు. ఆ విషయాన్ని చాలా సార్లు స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. తనకు ఇప్పటికి కూడా పవన్‌ అంటే ఇష్టం అని, ఆయన విధానాలు తనకు ఇష్టం అని చెప్పుకొచ్చింది. తాజాగా ఒక వ్యక్తిగా పవన్‌ అంటే తనకు చాలా అభిమానం అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన రెండవ పెళ్లి విషయమై కూడా రేణుదేశాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటికి కూడా తాను పవన్‌ కళ్యాణ్‌ను ప్రేమిస్తున్న కారణంగా రెండవ పెళ్లి చేసుకునేందుకు మనస్సు ఒప్పడం లేదని, రెండవ పెళ్లి చేసుకుంటే తనకు మగ తోడు లభిస్తుంది తప్ప, ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తితో తాను ప్రేమగా ఉండలేనేమో అనే ఉద్దేశ్యంతోనే పెళ్లి చేసుకోవాలంటే భయంగా ఉందని రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. ఆ వచ్చే వ్యక్తి తన పిల్లలకు సవితి తండ్రి అవుతాడు తప్ప తండ్రి అవ్వలేడని అందుకే పెళ్లి ఆలోచన ఉన్నా కూడా చేసుకోవాలని లేదని పేర్కొంది. మంచి వ్యక్తి తారస పడితే, తన మనస్సుకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే అతడిని పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి విషయమై మీడియాలో ఎలాంటి ప్రచారం చేయవద్దని, తనకు పెళ్లి చేసుకోవాలనిపించినా, పెళ్లి నిశ్చయం అయిన వెంటనే తానే స్వయంగా చెబుతాను అంటూ రెండవ పెళ్లి ముచ్చట్లను రేణుదేశాయ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.