సమంత తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని, త్వరలో పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ అమ్మడు అక్కినేని యువహీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ ఏడాదిలో ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ప్రకటించారు. ఇటీవలె వైభవంగా నిశ్చితార్థం చేసుకున్న సమంత ఇప్పటి నుండి సినిమాల్లో నటించడానికి చాలా షరతులు పెడుతుందట. ప్రేమ విషయం బయటకు తెలిసాక ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అని అంతా అనుకున్నారు. కాని సమంత నటన, అందం ముందు పెళ్లి అనేది చాలా చిన్నది. ఈ అమ్మడి హావభావాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే టాలీవుడ్ స్టార్ కుటుంబానికి కోడలిగా సమంత అడుగుపెట్టబోతున్న కూడా ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి.
పెళ్లి అయ్యాక కూడా సినిమాలను కంటిన్యూ చేస్తాను అని ఈ అమ్మడు పదేపదే చెబుతూనే ఉంటుంది. కాకపోతే పెళ్లి అయ్యింది కాబట్టి కాస్త ప్రత్యేకంగా కనిపించనుందట. సమంత ఇటీవలె చరణ్, సుకుమార్‌ల చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో నాభిని చూపించను అంటూ తేల్చి చెప్పిందట. గ్లామర్‌గా కనిపించడానికి ఒకే, డ్రస్స్ల పరంగా కూడా సర్దుకుంటాను కాని నాభిని ప్రదర్శించడం మాత్రం కుదరదు అని ముందే చెప్పిందట.సమంత నటన ముందు ఆమె నాభి అందాలు ఎందుకు అనుకుని దర్శకుడు అందుకు ఒకే చెప్పాడట. అన్నీ చూపిస్తూ గ్లామర్‌గా కనిపించడానికి ఒకే గాని నాభిని చూపించను అని చెప్పగానే చిత్ర యూనిట్ అందుకు అంగీకరించారట. హీరోయిన్ను విభిన్న కోణాలలో అందంగా చూపించే సుకుమార్ ఈ చిత్రంలో సమంత నాభి కనబడకుండా అందంగా కనిపించే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.