బాలీవుడ్ హాట్ భామ జాక్వెలిన్ ఫెర్నెండస్ మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిన్న వయస్సులో చేసిన పొరపాట్లు అలా చేసి ఉండకూడదు అని అనిపిస్తు ఉంటుంది అని వ్యాఖ్యానించింది. కాని చిన్నతనంలో చేసిన కొన్ని చిలిపి పనులు తెగ నవ్వు పుటిస్తాయి అంటూ తన చిన్న నాటి సంఘటనను ఏమాత్రం జంకు లేకుండా చెప్పుకొచ్చింది. ఈ అమ్మడికి 14ఏళ్ల వయస్సుల్లోనే భాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. అనుకోకుండా ఒకరోజు అతనితో లిప్‌లాక్ చేశానని ఈ అమ్మడు చెబుతూ తెగ నవ్వేసింది. తెలిసి తెలియని వయస్సులో జరిగిపోయిన ఆ తప్పు గుర్తుకు వస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అని ఈ అమ్మడు చిన్న తనంలో జరిగిపోయిన తప్పును చెబుతూ నవ్వుకుంటోంది.
చిన్న తనంలో తెలియని వయస్సులో అది జరిగింది పోయింది కాబట్టి నేనేం ఫీల్ కాను అంటూ ఈ అమ్మడు అంటోంది. తెలిసీ తెలియని ఆ వయస్సులో ఆ తప్పు చేయకూడదు అని ఇప్పుడు తెలుస్తోందని, చిన్న చిన్న పొరపాట్లు కామనే అని, ఇది కూడా అలాంటిదే అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికే ఆ వ్యక్తితో బ్రేకప్ అయ్యిందని అంతకు మించి ఇంకా ఏం లేదని జాక్వెలిన్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కెరియర్ మీద పూర్తి దృష్టిని పెట్టినట్టు ప్రేమ, భాయ్ ఫ్రెండ్ లాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నాను అని ఈ అమ్మడు ముచ్చటించింది.