మలయాళంలో సూపర్ డూపర్ చిత్రాలలో నటించి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మోహన్‌లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో మోహన్‌లాల్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యి పోయారు. ఆ చిత్రంతో మోహన్‌లాల్ పేరు ఈ తరం ప్రెక్షకులకు కూడా సుపరిచితం అయ్యింది. తాజాగా ఈయన సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని ఒక వ్యక్తి ఆరోపణలు చేశాడు. ఆ వ్యక్తి సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సెక్స్ రాకెట్‌ను గతకొంత కాలంగా నడుపుతున్నాడని, తన దగ్గర అందుకు సంబంధించిన పక్కా ఆధారాలు కూడా ఉన్నాయని కారు కూతలతో ఒక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
సెక్స్ రాకెట్ ఆరోపణలు కాస్త మోహన్‌లాల్ దరి చేరాయి. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించిన మోహన్‌లాల్ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏ ఆధారాలు లేకుండా సూపర్‌స్టార్ సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని కేవలం పాపులారిటీ కోసమే ఆ వ్యక్తి సూపర్‌స్టార్‌పై తప్పుడు కూతలు కూశాడని పోలీసులు తెలిపారు. పాపులారటీ కావాలంటే నీ టాలెంట్‌ని వాడుకో కాని సుపర్స్టార్లను అడ్డంగా పెట్టుకోకూడదు అంటూ పోలీసులు సదరు వ్యక్తికి తమ పద్దతిలో మర్యాదలు చేశారు.