బాలీవుడ్‌పైనే ఎక్కువ దృష్టి!

bahubali 2
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో డబ్బింగ్‌ అయిన ‘బాహుబలి’ ఏకంగా వంద కోట్లను వసూళ్లు చేసింది. ఒక డబ్బింగ్‌ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు చేయడం అదే ప్రథమం. ఇక ‘బాహుబలి 2’పై కూడా బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా ఉంది. అందుకే బాలీవుడ్‌లో ‘బాహుబలి 2’ను ప్రమోషన్‌ చేసే విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టాలని జక్కన్న అండ్‌ టీం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

‘బాహుబలి 2’ బాలీవుడ్‌లో 400 కోట్ల టార్గెట్‌తో విడుదల కాబోతుంది. ఒక హిందీ సినిమా రేంజ్‌లో ‘బాహుబలి’ని ఉత్తరాదిన పబ్లిసిటీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం భారీ ప్రచార వ్యూహంను రెడీ చేశారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రెటీలతో ఈ సినిమాకు ప్రమోషన్‌ చేయించబోతున్నారు. సౌత్‌లో ఇప్పటికే ‘బాహుబలి 2’పై భారీ అంచనాలున్నాయి. దాంతో ఇక్కడ పెద్దగా ప్రచారం చేయాలని భావించడం లేదు. మొత్తానికి ‘బాహుబలి 2’ వెయ్యి కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగబోతుంది. అందుకు తగ్గట్లుగా ప్రచార వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. బాలీవుడ్‌ సినిమాల రేంజ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌ను సాధించడం ఖాయంగా తెలుస్తోంది.