సినీ తారల ప్రయివేటు ఫొటోలను లీక్ చేసి మొదటగా హ్యాక్ అని చెప్పి తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించింది గాయని సుచిత్ర. చివరకు తన భార్యకు పిచ్చి పట్టిందని సుచిత్ర భర్త సంచలన వ్యాఖ్యలు చేయడంతో సుచిత్రనే కావాలని ఇలా తారల వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసిందని స్పష్టం అయింది. పలువురు హీరో, హీరోయిన్ల సాన్నిహిత్య ఫొటోలతో పాటు భామల నగ్న వీడియోలు కూడా లీక్ చేసి సంచలనం సృష్టించిన ఈ అమ్మడిపై తమిళ సినీ వర్గాల వారు కారాలు మిరాయాలు నూరుతున్నారు. తాజాగా సుచి తనకు ప్రాణ హాని భయం ఉందని ఆరోపణలు చేస్తోంది.
ముంబైలోని ఓ పబ్లో తనమీద కుట్రలు జరుగుతున్నాయని సుచి భయ పడిపోతుంది. ఒక అపరిచిత వ్యక్తి తన నివాసంకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టి ఓపెన్ చేయమని చాలా గట్టిగా అరిచాడని, అతని మొహాన్ని చూస్తుంటే తనను చంపేంతా కోపం ఉందని ఈ అమ్మడు తెగ భయపడుతోంది. ఇండస్ట్రీలో రహస్యంగా రొమాన్స్ చేసిన వీడియోలను లీక్ చేసే వరకు ఈ అమ్మడి మీద కుట్రలు జరుగుతున్నాయని సుచి ఆందోళన చెందుతుంది. నాకు చాలా భయంగా ఉంది… బాబోయ్ నన్ను చంపేస్తారేమో అంటూ స్నేహితులతో చెబుతూ వణికిపోతుందట. సుచి భర్త కార్తీక్ కుమార్ ఈమె మానసిక పరిస్థితి బాలేదని చెప్పాడు. నిజంగా సుచికి పిచ్చి పట్టినట్టే ఉంది. అందుకే ఇలా తనకు తానే భయపడుతుందని అని తమిళ జనాలు సుచిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.