కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ

హైదరాబాద్ దారుసలెం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో అసరుద్ధీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరణపై తన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం ఎంఐఎం అధినేత అసరుద్ధీన్ ఓవైసీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముస్లింసోదరులకు వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నందుకు నిరసనగా రాష్ర్టంలోని అధికార కాంగ్రె స్ ప్రభుత్వానికి తన పార్టీ మద్దతును ఉపసంహరించికుంటున్నట్లు వెల్లడించారు. దీనితో పాటుగా కేంద్రంలోని యూపీఎ ప్రభుత్వానికి కూడా తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు ఓవైసీ. గతంలో టీడీపీ ప్రభుత్వం పాలన సమయంలో ముస్లిం సోదరులు చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చిందని అటు తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తగు ప్రాధాన్యత, సహాయసహకారాలు కల్పించడం వల్ల 1998 నుంచి మద్దతిస్తూ వచ్చ్చామని తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత 2010 నుంచి ప్రభుత్వం మతవిధ్వేశాలను అరికట్టడంలో ఘోర వైఫల్యం చెందుతూ వచ్చిందని ఓవైసి తెలియజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ ఏకంగా మరో పి.వి. నరసింహారావు లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే ప్రెసెమీట్ అనంతరం ఓ విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా వైఎస్ జగన్ జగన్ నా స్నేహితుడు అలాగే కిరణ్ కుమార్ రెడ్ది ఒకప్పుడు తన స్నేహితుడు అంటూ చెప్పడం కొన్ని అనుమానాలకు దారితీసేలా ఉంది. ఎదేమైనా ప్రస్తుతం ఉన్న కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ ప్రథమ లక్ష్యమని అవసరమైతే తాము ఎన్నికలకు సైతం సిద్ధమని వ్యాఖ్యానించారు అసరుద్ధీన్ ఓవైసీ.