టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి 2’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లుగా రెండు రోజులుగా భారీగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ వార్తలకు జక్కన్న ఫుల్ స్టాప్ పెట్టాడు. నేడు స్వయంగా జక్కన్న ట్విట్టర్ ద్వారా ఆ విషయం కేవలం పుకారే అంటూ తేల్చి చెప్పాడు. తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబచ్చన్, తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్‌లాల్‌లు వాయిస్ ఓవర్ చెప్పబోతున్నారనే వార్తలు రావడంతో ‘బాహుబలి 2’పై అంచనాలు మరింతగా పెరిగాయి.
రెండు రోజులుగా వైరల్ అవుతున్న ‘బాహుబలి 2’కు వాయిస్ ఓవర్ చిరంజీవి న్యూస్‌కు జక్కన్న ట్వీట్‌తో ఫుల్స్టాప్ పడ్డట్లయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ సినిమా వెయ్యి కోట్ల లక్ష్యంతో భరిలోకి దిగబోతుంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్స్‌గా నటించగా, రానా విలన్‌గా నటించాడు, రమ్యకృష్ణ, సత్యరాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.