చందమామ కాజల్‌ పెళ్లి ముచ్చట్లు

kajal

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా దశాబ్ద కాలంకు పైగా దూసుకు పోతున్న కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి గురించి చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాజల్‌ అగర్వాల్‌ చెల్లి నిషా అగర్వాల్‌ పెళ్లి ఇప్పటికే జరిగింది. ఆ సమయంలోనే కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి కూడా జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే చెల్లి పెళ్లితో తనకు సంబంధం ఏంటని, ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందంటూ గతంలో చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల కాజల్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

కాజల్‌ చాలా కాలంగా ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. అతడినే పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబయిలో పలు హోటల్స్‌ ఉన్న సదరు వ్యాపారవేత్తతో పెళ్లికి ప్రస్తుతం కాజల్‌ సిద్దం అవుతుంది. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు చాలా కాలం క్రితమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కాజల్‌ ప్రేమ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచుతూ వస్తుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని కాజల్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సంవత్సరం చివర్లో కాజల్‌ పెళ్లి జరిగే అవకాశాలున్నాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.