నిత్యా, శర్వానంద్‌ ల ఏమిటో ఈ మాయ

ఒక సినిమా హిట్‌ అయితే ఆ సినిమాలోని డైలాగ్స్‌, పాటల పల్లవుల్లతో కొత్త సినిమా టైటిల్స్‌ రావడం సర్వసాధరణంగా జరిగేదే! అయితే ఫర్‌ ఏ ఛేంజ్‌… ఈ సారి ఓ హిట్టయిన సినిమా పేరుకే కాసింత మార్పులు చేసినట్టుగా మరో సినిమా రాబోతోంది. అక్కినేని నాగ చైతన్య, సమంతా కాంబినేషన్‌ లో సూపర్‌ హిట్‌ గా నిలిచిన “ఏ మాయ  చేశావే”   వచ్చింది. ఇప్పుడు తాజాగా “ఏమిటో ఈ మాయ” అంటూ సరికొత్త చిత్రం రాబోతోంది. “నా ఆటోగ్రాఫ్‌” వంటి అద్భుతమైన చిత్ర దర్శకుడు(తమిళ మాతృక) చేరన్‌ దర్శకత్వంలో మల్లూబేబీ నిత్యామీనన్‌, శర్వానంద్‌ జంటగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 22 నుంచి షూటింగ్‌ మొదలవబోతున్న ఈ ప్రేమకథా చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించబోతున్నాడు.