ఝుమ్మంది నాదం చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయినా సొట్టబుగ్గల భామ తాప్సి, ఈ మధ్య బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం తో సౌత్ ఇండస్ట్రీ ఫై పలు చీఫ్ కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది..సౌత్ సినిమాల్లో హీరోయిన్లంతా గ్లామర్ డాల్స్ అన్నట్లు , గ్లామర్ కోసం తెలుగు ప్రేక్షకులు హీరోయిన్స్ ను చూస్తారు అన్నట్లు గా మాట్లాడింది..
తాజాగా ఇప్పుడు ఆమె నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘నామ్ షబాన’ తెలుగులో ‘నేనే షబాన’ పేరుతో అనువాదం చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు వెర్షన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ నేపథ్యం లో తాప్సి తన ట్విట్టర్ లో తెలుగు పోస్టర్ పోస్ట్ చేసి..తెలుగు వాళ్లను ఎలా మరిచిపోతా.. వాళ్ల కోసమే ఈ సినిమాను తెలుగులోకి తెస్తున్నాం అంటూ ఏదో మనవాళ్లపై అమితమైన ప్రేమ ఉన్నట్లుగా ట్విట్టర్లో కామెంట్ చేసింది. అవసరానికి తగ్గట్లు సెలబ్రెటీలు ఎలా మాట్లాడతారు అనడానికి తాప్సినే ఉదాహరణ గా చెప్పవచ్చు.